కాకతీయ, జూలూరుపాడు: జిల్లాలోని ధ్వంసమైన ప్రధాన రహదారుల తీరుతెన్నులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తగూడెం – ఖమ్మం మార్గంలోని జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా వద్ద ధ్వంసమైన ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. రహదారులు ధ్వంసమైన తీరు కన్పించేలా సెల్ఫీలు దిగి ప్రసార మాధ్యమాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. ధ్వంసమై, గుంతలమయమై ప్రమాదభరితంగా ఉన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ డిజిటల్ క్యాంపెయిన్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


