epaper
Saturday, March 7, 2026
epaper

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు
నర్సంపేటలో రెండు పార్టీల దోపిడీ ఒప్పందం
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమివ్వాలి
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

కాకతీయ, నర్సంపేట : బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విమర్శలు చేస్తూనే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా అంగీకరిస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎమ్మెల్యే మాధవ రెడ్డి గ్రామగ్రామాన తిరిగి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడుతూ పాలన సాగిస్తారని నిలదీశారు.

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ ఒకే బాట
గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ – ఈ రెండు పార్టీలు నర్సంపేట ప్రజలకు ఏం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ‘కాంగ్రెస్ నేతలు నిలువునా దోచుకుంటున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అని ఆరోపిస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఆ ఆరోపణలు నిజమా కాదా చెప్పకుండా ‘మీరు చేసినప్పుడు ఏమైంది? మా దగ్గర కూడా ఆధారాలున్నాయి’ అంటూ మీడియా ముందు మాట్లాడటం చూస్తే, రెండు పార్టీల మధ్య దోపిడీపై అప్రకటిత ఒప్పందం ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పుడు ఎందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘నువ్వు తినేది బయటికి చెప్పకు, నేను తినేది బయటికి చెప్పను’ అన్న ధోరణితోనే నర్సంపేట ప్రజలకు అన్యాయం జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. అధికార దాహం ఎప్పటికీ తీరదని, ప్రజలను పట్టి పీడిస్తూ తమ కడుపు నింపుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్న బీజేపీ నాయకులను గుర్తించి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి ఈ దోపిడీ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాలని రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహారాములు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్‌తో పాటు పలువురు జిల్లా, మండల, పట్టణ, యువమోర్చా, ఎస్టీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం మంత్రి కొండా సురేఖ ​శివ నగర్‌లో కుట్టు మిషన్ల పంపిణీ 35వ...

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి కాకతీయ, చెన్నారావుపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ...

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం కాకతీయ, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ...

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన కాకతీయ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీవివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో...

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!?

మెమోలు వచ్చినా… “అను”భవం మారాధా..!? కొమ్మాల దేవస్థానంలో మహిళా ఉద్యోగి వింత పోకడలు డ్రెస్...

పట్టణాభివృద్ధే లక్ష్యం

పట్టణాభివృద్ధే లక్ష్యం చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ కాకతీయ, నర్సంపేట టౌన్: పట్టణాన్ని అన్ని రంగాల్లో...

ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దిశ...

వాలమ్తారి భూముల‌ను

వాలమ్తారి భూముల‌ను విద్యాసంస్థ‌ల‌కు కేటాయించండి ముఖ్యమంత్రికి జీవన్ రెడ్డి వినతి కాకతీయ, జగిత్యాల : జగిత్యాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img