బీఆర్ ఎస్ అభ్యర్థులనుగెలిపించాలి
మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి
కాకతీయ, పాలకుర్తి : తిరుమలగిరి గ్రామ పంచాయతీలో జరుగుతున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మా రెడ్డి గ్రామానికి చేరుకోగా, గ్రామ ప్రజలు మరియు మహిళా సంఘాల సభ్యులు కోలాటాలు నిర్వహిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నాయకులు ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


