కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకే మాగంటి సునీతకు అవకాశం కల్పించాం. ఆమె ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు చూపగల సామర్థ్యం ఉన్న నాయకురాలు” అని పేర్కొన్నారు.
గతంలో జూబ్లీహిల్స్ నుంచి గోపీనాథ్ పలు సార్లు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో సునీత పోటీ చేయనుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.BRS పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నట్లుగా, సునీత అభ్యర్థిత్వంతో మహిళా ఓటర్ల మద్దతు మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. త్వరలో పార్టీ తరఫున ఆమె అధికారిక ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.


