మున్సిపల్ పోరులో బి ఆర్ ఎస్ విస్తృత ప్రచారం
కాకతీయ,హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. నల్గొవా వార్డ్ అభ్యర్థి బూర వెంకన్న గౌడ్ తరుపున ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించడం జరిగింది బి ఆర్ ఎస్ హయం లో జరిగిన అభివృద్ధి పనులను వివరించుకుంటూ గెలిచినా తరువాత ప్రతి ఒక్కరికి జవాబు దారిగా ఉంటూ వార్డ్ సమస్యలు తీరుస్తూ అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం క్రమం లో అభ్యర్థి బూర వెంకన్న గౌడ్ బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అన్వర్ భాయ్, వెంకట్రామిరెడ్డి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, తిరుపతి రెడ్డి,శ్యామ్ సుందర్ గౌడ్, కొండల్ రెడ్డి ప్రభాకర్ గౌడ్ పూదరి రవీందర్ గౌడ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




