బీఆర్ఎస్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మునిసిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రాంమ్మోహన్‌రావుతో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటంలో బీఆర్ఎస్ ముందుండాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహిస్తూ, ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నాయకులు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు


