మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్.. ముఖ్యమంత్రిగా కేసీఆర్
ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానాన్ని చెరిపేయలేరు
తెలంగాణ తల్లి విగ్రహాం మార్చడం సిగ్గుచేటు
: రాష్ట్ర రెడ్‌కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి
కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజల గుండెల్లో నిక్షిప్తమై ఉన్న కేసీఆర్ ప్రేమను..పేరును కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరిపేయలేదని రాష్ట్ర రెడ్‌కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ తల్లి అని అన్నారు. అలాంటి తల్లి విగ్రహానికి ముసుగు వేయడం, పాత విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాలను పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం సారథి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దిశలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహ రాజకీయాలకు దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడైనా, నేడైనా, ఎప్పుడైనా తెలంగాణకు కాంగ్రెస్ మోసమేనని సతీష్ రెడ్డి విమర్శించారు. మంగళవారం విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా గోవిందరావుపేట మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాలు పోసి, పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సారథి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దిశలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహ రాజకీయాలకు దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేధావులు, కవులు, కళాకారులు, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కేసీఆర్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి స్వరూపం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబమన్నారు. అలాంటి ప్రతీకను మార్చడం కన్నతల్లిని అవమానించినట్లే అన్నారు. తిరిగి బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను ఆయన కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


