epaper
Monday, March 2, 2026
epaper

ఇష్టారాజ్యంగా ఇటుక దందా!

ఇష్టారాజ్యంగా ఇటుక దందా!
పెద్ద‌ప‌ల్లి జిల్లాలో 200కు పైగా ఇటుక బట్టీల‌ కేంద్రాలు
సగానికి పైగా బట్టీల్లో నిబంధనల ఉల్లంఘన
వ్యవసాయ విద్యుత్ వ్యాపారానికి వినియోగం
చూస్తూ ఊరుకుంటున్న విద్యుత్ శాఖ
బట్టీల్లో బాల కార్మికులు – మౌనంగా కార్మిక శాఖ
అక్రమాలకు అండగా పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖ‌ల అధికారులు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారుల్లో అక్రమ ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, మంతని ప్రాంతాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో ఇటుకలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలను దర్జాగా నిర్వహిస్తున్నారు.జిల్లాలో కొనసాగుతున్న ఇటుక బట్టీల్లో మెజార్టీ నిబంధనల ఊసే లేకుండా నడుస్తున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వ్యాపారులు ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. అనుమతులు, లైసెన్సులు లేకుండా బట్టీలు కొనసాగుతుండగా, వ్యవసాయానికి కేటాయించిన ఉచిత విద్యుత్‌ను వ్యాపారానికి వినియోగిస్తున్నారు. విషయం తెలిసినా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

200కు పైగా ఇటుక బట్టీలు… లెక్కలే లేవు!

ఒక అంచనా ప్రకారం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఇటుకలను ఉత్పత్తి చేస్తున్న ఇటుక బట్టీలు 200కు పైగా ఉన్నాయి. వీటితో పాటు చిన్న స్థాయిలో కొనసాగుతున్న బట్టీలు వందల్లో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చాలా బట్టీలు గ్రామ పంచాయతీ, గనులు, కాలుష్య నియంత్రణ శాఖ అనుమతులు లేకుండానే పనిచేస్తున్నట్లు సమాచారం. సీజనల్‌గా బట్టీలు ఏర్పాటు చేసి అధికారుల కంటపడకుండా దందా సాగుతున్న వైనం అనేక అనుమానాలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని ఇటుక బట్టీలు ఉన్నాయనే స్పష్టమైన లెక్కలు అధికారికంగా లేకపోవడం పర్యవేక్షణ లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

నిబంధనలు ఇలా… వాస్తవం ఇలా…

నిబంధనల ప్రకారం ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే గ్రామ పంచాయతీ, గనులు & భూగర్భ శాస్త్ర శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తప్పనిసరి. నివాస ప్రాంతాలకు కిలోమీటరు దూరం, పంట పొలాలకు 100 మీటర్లు, ప్రధాన రహదారులకు 200 మీటర్ల దూరం పాటించాలి. కానీ జిల్లాలో కొనసాగుతున్న బట్టీల్లో ఈ నిబంధనలేవీ అమలవడం లేదు. చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టిని తోడేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటుకలు కాల్చేందుకు అనుమతి లేని ఇంధనం వినియోగిస్తున్నారని, సింగరేణి బొగ్గు అక్రమంగా బట్టీలకు చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ శాఖలకు చెందిన కొందరు అధికారులు ముడుపులు తీసుకుంటూ అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటుక బట్టీల మధ్య బాల్యం

జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీల్లో బిహార్, ఒడిశా, యూపీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరి పిల్లలు పాఠశాలల బాట తప్పి ఇటుక బట్టీల్లోనే పనులకు దిగుతున్నారు. ఒక అంచనా ప్రకారం సుమారు 8 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, వెయ్యికి పైగా బాల కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాల కార్మిక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కార్మిక శాఖ కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
కనీస వసతులు లేకపోవడం, గుడిసెల్లో జీవనం, వైద్య సదుపాయాల లేమి, వేతనాల దోపిడీ వంటి సమస్యలు వలస కార్మికుల జీవితాలను నరకప్రాయంగా మారుస్తున్నాయి. గతంలో ఇటుక బట్టీల్లో లైంగిక దాడుల ఘటనలు నమోదైనా పరిస్థితి మారలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఇటుక బట్టీలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img