కొమ్మాల అంగడి తై బజార్ వేలం..
*సీల్డ్ కవర్ టెండర్ ద్వారా రూ.61,11,116 కైవసం చేసుకున్న జూల వేణు
కాకతీయ, గీసుగొండ:
కొమ్మాల అంగడికి తై బజార్ వేలాన్ని నిర్వహించగా సీల్డ్ కవర్ పద్ధతిలో జరిగిన టెండర్ ద్వారా రూ.61,11,116/- లకు జూల వేణు టెండర్ కైవసం చేసుకున్నారు. మండలంలోని కొమ్మాల గ్రామపంచాయతీ ఆవరణలో మండల పరిషత్ అధికారి పాక శ్రీనివాస్ అధ్యక్షతన వేలంపాట నిర్వహించారు. పశువుల రహదారి రూ 200, మేకలు గొర్రెలు రూ 100, లారీ జీపు రూ 50, ఆటో హోటళ్లు దుకాణాలు బండ్లు రూ 30గా ధరలను నిర్ణయించారు. కొమ్మాల పంచాయతీ 20 వారాలకు గాను నిర్వహించిన ఈ వేలంలో 79 మంది టెండర్ దారులు ఆసక్తి చూపగా పదిహేడు మంది బహిరంగ వేలంలో పాల్గొన్నారు.బహిరంగ వేలంలో అత్యధికంగా 59 లక్షలకు జూల వేణు పాడగా,ఎనిమిది సీల్డ్ కవర్ టెండర్లు నమోదయ్యాయి. అనంతరం సీల్డ్ కవర్ టెండర్లను విప్పగా అత్యధికంగా రూ 61,11,116తో మళ్లీ జూల వేణు టెండర్ కైవసం చేసుకోవడం విశేషంగా నిలిచింది,వేలం ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీఓ శ్రీనివాస్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కన్నబోయిన యమునా ప్రవీణ్ యాదవ్, పంచాయతీ కార్యదర్శులు నిమ్మల రాజు,మురళీకృష్ణ, కారోబార్ రాజేష్,గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.


