కాకతీయ, గీసుగొండ/ సంగెం: బాత్రూం గోడ కూలి బాలుడు మృతి చెందిన ఘటన సంగెం మండలం చింతలపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపల్లి గ్రామం యాదవవాడకు చెందిన వేల్పుల నవదీప్ (11) శనివారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. బాలుడు దుకాణానికి వెళ్తుండగా పక్కింటి బన్న రమేష్ బాత్రూం గోడ కూలి నవదీప్ మీద పడడంతో తలకు తీవ్రగాయాలై రక్తస్రావంతో కుప్పకూలి పోయాడు. వెంటనే తండ్రి సాంబరాజు కుమారుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగానే గోడ కూలినట్లు సమాచారం.


