బూత్ సమ్మేళనం, యూనిటీ మార్చ్ విజయవంతం చేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ,హుజురాబాద్: ఈనెల 19న హుజురాబాద్‌లో జరగనున్న కరీంనగర్ పార్లమెంట్ స్థాయి బూత్ కార్యకర్తల సమ్మేళనం, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించే యూనిటీ మార్చ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుజురాబాద్‌లో జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, సోషల్ మీడియా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా అమలు చేస్తున్న అసమర్థ పాలన, ఆరు గ్యారంటీల మోసం వంటి విషయాలను ప్రజల్లో బహిర్గతం చేయడానికి పార్టీ శ్రేణులకు కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ దిశానిర్దేశనం చేస్తారని అన్నారు. బుధవారం హుజురాబాద్‌లో నిర్వహించే సమ్మేళనానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. సోమవారం కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి బస్టాండ్ వరకు నిర్వహించనున్న యూనిటీ మార్చ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటారని తెలిపారు. ఐక్యతా మార్చ్‌లో పార్టీ కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, కార్యదర్శి నరసింహ రాజు, హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, మండల అధ్యక్షుడు రాముల కుమార్, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు రాజు, వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, నాయకులు యాదిరెడ్డి, యాంసాని శశిధర్, సబ్బని రమేష్, పారుపల్లి కొండల్ రెడ్డి, మోడేపు వినయ్, భూపతి ప్రవీణ్, నరేడ్ల ప్రవీణ్ రెడ్డి, నరేడ్ల చైతన్య రెడ్డి, చిదురాల శ్రీనివాస్, చిదురాల రాణి, ముప్పు మహేష్, తిరుపతి రెడ్డి, ప్రభాకర్, గణేష్, తూర్పాటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


