పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధం
ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లిలో గ్రంథాలయ అభివృద్ధికి శంకుస్థాపన
కాకతీయ, పెద్దపల్లి : పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. డి.ఎం.ఎఫ్.టి నిధుల ద్వారా రూ.1 కోట్ల 50 లక్షల వ్యయంతో భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు. ఆ తర్వాత 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అన్నయ్య గౌడ్, ఎమ్మెల్యే విజయరమణ రావును శాలువాతో సన్మానించి ‘నిప్పుల వాగు’ పుస్తకాన్ని అందజేశారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.గత ప్రభుత్వం గ్రంథాలయ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిందని, పెద్దపల్లి పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సదుపాయాలతో కొత్త గ్రంథాలయాన్ని నిర్మించనున్నామని చెప్పారు. ఆర్‌అండ్‌బి శాఖతో చర్చించి 12 గుంటల స్థలాన్ని కేటాయించారని, ఏడాదిలోపు భవన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంఈఓ సురేందర్ కుమార్, మాజీ కౌన్సిలర్లు, గ్రంథాలయ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


