కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆర్యవైశ్య యువతి నవ్య వివాహానికి కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య నాయకులు అండగా నిలిచారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పట్టణంలోని వైశ్యభవన్‌లో పెళ్లికూతురికి చీర, పుస్తె మట్టెలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లుగా సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది వేణుగోపాల్, కోశాధికారి సుద్దాల వెంకటేష్, బొడ్ల శ్రీరాములు, తిరుపతి, అలెంకి సంతోష్‌రాజ్, సంతోష్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.


