వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని
కాకతీయ, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్‌రెడ్డిని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి సోమవారం కలిశారు. హైదరాబాద్ లోని వేం నివాసానికి వెళ్లిన బొమ్మినేని ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వేం నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వం తెలంగాణ అభివృద్ధికి అవసరమని అభిలషించారు. వ్యాపార, వాణిజ్య రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్యసభ వేదికగా గళమెత్తి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.


