కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలోని లాజ్ ఏంజిల్స్ పోలీసులు 36ఏళ్ల సిక్కు వ్యక్తి గురుప్రీత్ సింగ్ ను కాల్చి చంపారు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో సింగ్ గుట్కాను ప్రదర్శించినట్లు కనిపించింది. పోలీసులపై దాడి చేయడానికి యత్నించడంతో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. గురుప్రీత్ సింగ్ అనే 36ఏండ్ల సిక్కు వ్యక్తిని రోడ్డు మధ్యలో లాస్ ఏంజిల్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన ఫుటేజీ ప్రకారం..సింగ్ సాంప్రదాయ సిక్కు యుద్ధ కళల్లో ఒకటైన గుట్కాను ప్రదర్శించాడు. లాస్ ఏంజిల్స్ డౌన్ టౌన్ లోని క్రిప్టో . కామ్ అరీనా సమీపంలో అతను ఒక కత్తి పట్టుకుని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతను లొంగిపోయేందుకు నిరాకరించడంతో పాటు పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో కాల్చి చంపారు.
గురు ప్రీత్ సింగ్ కత్తితో రోడ్లపై గట్కా (సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్) ప్రదర్శిస్తూ…అక్కడి వారిని భయపెట్టాడు. తర్వాత కారును ప్రమాదకరంగా నడిపాడు. పోలీసులు అతడిని అదుపు చేయాలని చూడగా.. వారి కారుపైకి కత్తితో దూసుకెళ్లాడు. ఆత్మరక్షణలో భాగంగానే గురుప్రీత్ ను కాల్చినట్లు పోలీసులు తెలిపారు.గత నెల జరిగినట్లు కనిపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


