గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట శివారులో శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభ్యమైంది.గమనించిన స్థానికులు చేర్యాల పోలీసులకు సమాచారం ఇవ్వగ. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. మహిళా వయస్సు 35 నుంచి 40 ఏళ్ల పైబడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి నల్లటి బుర్కా తో పాటు ఎర్ర రంగు నైటీ ధరించింది మేడలో తాళిబొట్టుతో పాటు తాయత్తు ఉందని పోలీస్ లు తెలిపారు. ఎవరికైనా మృతరాల వివరాలు తెలిసినచో వెంటనే ఫోన్ :8712667356 సమాచారం అందించాలని కోరారు.


