epaper
Wednesday, January 21, 2026
epaper

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌
రాములవారి ఆలయానికి రూ.350 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌
నాలుగు దశల్లో అభివృద్ధి పనులు
మాడ వీధుల విస్తరణకు తుది ద‌శ‌లో భూసేకరణ
ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో స్వ‌యంగా సీఎం వెల్ల‌డి
ప్రభావిత కుటుంబాలకు నగదు–ఫ్లాట్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సానుకూల‌త‌
శ్రీరామనవమి తర్వాత పనులు ప్రారంభించేలా ప్లాన్‌

కాకతీయ, భద్రాచలం : భద్రాద్రి రామ‌య్య ఆల‌యాన్ని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. అందుకు మాస్ట‌ర్ ప్లాన్‌తో ముందుడుగు వేసిన రేవంత్ స‌ర్కారు.. బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకుని భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తోంది. భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయాన్ని అయోధ్య తరహాలో ‘టెంపుల్‌ సిటీ’గా అభివృద్ధి చేసేందుకు రూ.350 కోట్లతో భారీ మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వ అనుమతి లభించగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ విస్తరణ, భక్తుల సౌకర్యాల పెంపు లక్ష్యంగా ఈ మాస్టర్‌ ప్లాన్‌ను నాలుగు దశల్లో అమలు చేయనున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్‌ సర్కార్‌ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. యాదాద్రితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాల అభివృద్ధికి రూపకల్పన చేసిన ప్రణాళికల్లో భద్రాచలం కీలకంగా నిలిచింది. స్వామివారి కళ్యాణం సందర్భంగా ఇప్పటికే మాడ వీధుల విస్తరణకు రూ.34.45 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పది ప్రముఖ ఆలయాల అభివృద్ధికి కేటాయించిన రూ.2,202.35 కోట్లలో భద్రాచలం ఆలయానికి రూ.350 కోట్లు కేటాయించారు.

నాలుగు దశల ప్రణాళిక

మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం మొదటి దశలో రూ.115 కోట్లతో ఆలయ ప్రాంగణ విస్తరణ, నూతన మండపాలు, ప్రసాద విభాగం, క్యూ హాల్స్‌, పరిపాలన భవనాల నిర్మాణం చేపడతారు. భక్తులకు దర్శన సౌకర్యాలు మెరుగుపడేలా ఈ దశను కీలకంగా భావిస్తున్నారు. రెండో దశలో రూ.35 కోట్లతో ఘాట్ల అభివృద్ధి, ఆలయ పరిసర రోడ్లు, విస్తా కాంప్లెక్స్‌ విస్తరణ, అడ్మిన్‌ బ్లాక్‌ నిర్మాణ పనులు చేపడతారు. మూడో దశలో రూ.100 కోట్లతో భక్తరామదాసు ప్లాజా, రామాయణ మ్యూజియం, మల్టీ లెవల్‌ పార్కింగ్‌, వాగ్గేయకారుడు నర్సింహదాసు పేరుతో ఆడిటోరియం నిర్మించనున్నారు. నాలుగో దశలో టెంపుల్‌ టౌన్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా హోటళ్లు, గిరిజన మ్యూజియం, రామవనం, పట్టణ సుందరీకరణకు మరో రూ.100 కోట్లు వెచ్చించనున్నారు.

భూసేకరణ వేగిరం..!

ఆలయ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల విస్తరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.34 కోట్ల నిధులను మంజూరు చేసింది. తూర్పు, పడమర, దక్షిణం దిశల్లో ఉన్న 43 ఇళ్లను తొలగించి సుమారు 1.30 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూసేకరణతో ఆలయ ప్రాంగణం విస్తరించి ఉత్సవాలు, భక్తుల రద్దీ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి. భూసేకరణ వల్ల ప్రభావితమైన 39 నుంచి 40 కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం, పరిహారం ప్యాకేజీని ఖరారు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.7.86 లక్షల నగదు పరిహారంతో పాటు పట్టణంలో నిర్మించిన ఫ్లాట్‌ను అందించనున్నారు. త్వరలోనే బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. వారు తరలివెళ్లిన అనంతరం విస్తరణ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

భక్తుల సౌకర్యాలే లక్ష్యం

ప్రస్తుతం ఆలయ ప్రాంగణం ఇరుకుగా ఉండటం, మాడ వీధులు చిన్నవిగా ఉండటంతో భక్తులకు, ఉత్సవాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వసతి, రవాణా, పార్కింగ్‌, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఖమ్మం కలెక్టర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను ప్రభుత్వం పరిశీలించి మార్పులు–చేర్పులు చేసిన తర్వాత నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీరామనవమి వేడుకల అనంతరం నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ అమలుతో భద్రాచలం ఆలయం దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే టెంపుల్‌ సిటీగా రూపుదిద్దుకోనుందని అధికారులు భావిస్తున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు కాకతీయ, జూలూరుపాడు: ప్రధాన మంత్రి ఉజ్వల...

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి మేయర్, వైస్‌మేయర్ పదవులు దళితులకు కేటాయించాలి జనాభా ప్రాతిపదికన...

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి క్రీడలతో ఆరోగ్యం – చదువుతో...

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : 2025–26...

టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : తెలంగాణ...

అనారోగ్యంతో స‌ర్పంచ్‌ తులసిరామ్ కన్నుమూత

అనారోగ్యంతో స‌ర్పంచ్‌ తులసిరామ్ కన్నుమూత నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కాకతీయ, కారేపల్లి...

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ కాకతీయ, ఖమ్మం...

4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె

4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె కాకతీయ, ఖమ్మం :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img