కాకతీయ, రాయపర్తి : ఈనెల 29న పోలీసు అమరవీరులను స్మరిస్తూ పాలకుర్తి భషారత్ ఫంక్షన్ హాల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి యువజన సంఘాల నేతలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు 8712685216, 9989197395 నెంబర్లను సంప్రదించాలని ఎస్సై సూచించారు.


