- 18న బంద్ జయప్రదం చేయాలి
- బీసీ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్
కాకతీయ, దుగ్గొండి : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. బుధవారం నిర్వహించిన రాస్తారోకో తో వాహనాలు ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బీసీ జేఏసీ చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడారు. అగ్రవర్ణ కులాల పిటిషన్ల కారణంగా హైకోర్టులో బీసీల రిజర్వేషన్లకు అడ్డుకట్ట పడటం శోచనీయమన్నారు. ఈనెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కానుగుల కుమారస్వామి, జిల్లా నాయకులు కోరే రాజేష్ కురుమ, డ్యాగం శివాజీ, మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, మండల కార్యదర్శి మొకిడే శ్రీకాంత్, మండల యూత్ అధ్యక్షులు బండారి ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


