epaper
Sunday, March 1, 2026
epaper

పాల‌న చేత‌గాక నింద‌లా?

పాల‌న చేత‌గాక నింద‌లా?

అడ్డిమారి గుడ్డిసూటిల సీఎం

మూడేళ్లు టైమ్‌పాస్‌ చేసిపో..

తెలంగాణను తెచ్చిన మొగోడు, మొనగాడు కేసీఆర్‌

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్‌

జ‌న‌గామ జిల్లాలో ప‌ర్య‌ట‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగ‌ళ‌వారం జ‌న‌గామ జిల్లాలో ప‌ర్య‌టించారు కేటీఆర్. ఈసంద‌ర్భంగా మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలన చేతగాక బీఆర్‌ఎస్‌ మీద నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ఏదో అడ్డిమారి గుడ్డిసూటిల సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. మూడేళ్లు టైమ్‌పాస్‌ చేసిపోక అవాకులు, చెవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి రైతులకు యూరియా ఇయ్య చేతగాదుగానీ.. అబద్ధాలు అనర్గళంగా వస్తయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను మల్ల మొలకెత్తనియ్యను’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి శపథం చేయడంపైనా కేటీఆర్‌ ఫైరయ్యారు. ‘నువ్వేంది కేసీఆర్‌ను మొలకెత్తనియ్యకపోయేది’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ కాంగ్రెస్‌ పార్టీ 60 ఏండ్లు తెలంగాణను తొక్కిపట్టిందని, తెలంగాణను మొలకెత్తనివ్వమని విర్రవీగిందని, అసుంటి కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచి తెలంగాణను మొలిపించిన మొగోడు, మొనగాడు కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు.

రైతులు గోస పడుతున్నరు

రైతులకు యూరియా ఇవ్వడంలో రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందని కేటీఆర్‌ విమర్శించారు. సరిపడా యూరియా అందక రైతులు గోస పడుతున్నరని ఆవేదన వెలిబుచ్చారు. ‘రేవంత్‌ పాలనలో యూరియా షాప్‌ల లేదు, యాప్‌ల లేదు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా కార్డు అంటూ కొత్త పాట అందుకున్నరని అన్నారు. ‘రైతులకు యూరియా తెలివిలేక నాటకాలాడుతున్న దద్దమ్మలు ఈ కాంగ్రెసోళ్లు’ అని మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలో రైతులకు సరిపడా ఎరువులు అందాయని, ఎరువుల దుకాణాల ముందు రైతులు లైన్‌లలో నిలబడాల్సిన అసవరం రాలేదని కేటీఆర్‌ గుర్తుచేశారు. కేసీఆర్‌ స్వయంగా రైతు కాబట్టి రైతుల సమస్యలు తెలుసని, ఆయన రేవంత్‌రెడ్డిలా రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ కాదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. జనగామలో ఇటీవల గెలిచిన బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు.

టీపీటీయూ డైరీ ఆవిష్క‌ర‌ణ

హైద‌రాబాద్‌లోని నివాసంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో క‌లిసి టీపీటీయూ డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్, వ్యవస్థాపకలు వేణుగోపాల స్వామి, జక్టో మాజీ అధ్యక్షులు జీ భుజంగరావు, మాధవరెడ్డి, సోమ్లానాయక్, వేణు బాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img