లక్ష విలువైన నల్లబెల్లం పట్టివేత
ఒకరు అరెస్ట్… మరో వ్యక్తి పరారీ
ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం మంగళితండా పరిధిలో నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన రూట్ వాచ్‌లో అక్రమ నల్లబెల్లం రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గుగులోత్ శివ అనే వ్యక్తి వద్ద నుంచి 150 కిలోల నల్లబెల్లం, 5 కిలోల పట్టికను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నల్లబెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న గుగులోత్ శివను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరో వ్యక్తి సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన శ్రీరంగం వెంటటరమణ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఒక ద్విచక్రవాహనం, ఒక చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నల్లబెల్లం రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


