ఎంపీడీవో కు బిజెపి వినతి
కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి గ్రామ పంచాయితీ మరియు మండల పరిధిలోని గ్రామాలలో ఏప్రిల్ 1 నుండి నల్లా పన్నులు వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఎంపీడీవో పార్థసారధికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో జీరో వాటర్ టాక్స్ విధానం అమల్లో ఉండగా, ఇప్పుడు ప్రజలపై నెలకు ₹50 చొప్పున అదనపు భారం వేయడం సరైంది కాదని, పారిశుద్ధ్య పనుల కోసం ఇతర మార్గాల ద్వారా నిధులు సమకూర్చడం మంచిదని
కాబట్టి, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని మండల పరిధిలో ఎక్కడా నల్లా పన్నులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సందీప్, సురేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేందర్, శ్రీను, అనిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


