ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
కాకతీయ, హనుమకొండ : మడికొండ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, మేయర్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జిల్లా కో-కన్వీనర్ పొనగోటి వెంకట్ రావు, గడ్డం మహేందర్, నార్లగిరి రామలింగం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. 1980 ఏప్రిల్ 6న స్థాపితమైన బీజేపీ అంత్యోదయ లక్ష్యంతో దేశంలోని చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, వరంగల్ మేయర్ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


