కాకతీయ, వరంగల్ ప్రతినిధి: భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షం కార్యక్రమాల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్ పరిధిలోని నాగమయ్య గుడిలో వరంగల్ బిజెపి శ్రేణులు మోడీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి ఆవరణలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వన్నాల వెంకటరమణ, సేవా పక్షం కో- కన్వీనర్లు కొంతం సంగీత్, రాజేశ్వరి, స్వరూప గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


