ఘనంగా బీజేపీ నేత కందిమల్ల బర్త్‌డే
స్థానిక నాయకుల సమక్షంలో కేక్ కట్టింగ్
భారీ బాణసంచాతో తూర్పు కోటలో జన సందడి
కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలా వరంగల్ తూర్పు కోట హనుమాన్ జంక్షన్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందిమల్ల మహేష్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, అనుచరులు కలిసి కేక్ కట్ చేసి, భారీగా బాణసంచా కాల్చి వేడుకలను సందడిగా జరుపుకున్నారు. కందిమల్ల మహేష్‌కు నాయకులు, స్థానిక అభిమానులు హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోగి సురేష్, సంగరాబోయిన చందర్, బేడిదే వీరన్న, చింతం అమర్ వర్మ, ఇట్ననేని ప్రతాప్, చింతం మోహన్ సాయి తదితరులు పాల్గొన్నారు.



