బీసీల పై కుట్ర చేస్తున్న బీజేపీ..
– బీసీలకు 42% శాతం రిజర్వేషన్ పై బీజేపీ కుట్ర..
– బీసీల అభివృద్దే కాంగ్రెస్ ధ్యేయం..
– మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు
కాకతీయ,ఆత్మకూరు: బిసిలకు 42% శాతం రిజర్వేషన్ చేయడం పై కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపుతుందని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు తెలిపారు. శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్ లో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారి (163) పై ఉన్న షాపులు,హోటళ్లు,పాఠశాలలు,కళశాల లా పై బిసి బంద్ చేపట్టారు. అనంతరం పరికిరాల వాసు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బీసీల పై చిత్తశుద్ధి ఉంటె వెంటనే బీసీలకు 42% శాతం రిజర్వేషన్ చేయాలనీ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.బీసీ ల పై కుట్ర చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.బీసీలను చిన్నచూపు చుస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం బిసి ప్రజలు చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు,మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి,చౌళ్లపల్లి మాజీ సర్పంచ్ కంచె రవి కుమార్,మాజీ జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు,మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి,యూవజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తనుగుల సందీప్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరీటి,గ్రామా పార్టీ అధ్యక్షులు బయ్యా కుమారస్వామి,లక్కర్సు కుమార్,లింగన్న,మొహమ్మద్ గాఫుర్,మండల నాయకులు బోరిగాం స్వామి,బాబు మియా,గుండెబోయిన శ్యామ్,వడ్డేపల్లి ప్రసాద్,రమేష్,ఉడుత మహేందర్,రాజస్వామి దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.


