epaper
Monday, March 2, 2026
epaper

BJP: అన్ని స్థానాల్లో బీజేపీదే పై చేయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఈ సారి ఎన్నికల సందర్భంలో జడ్పీటీసీ అభ్యర్థులను ముందుగా డిక్లేర్ చేయాలని, ఏకగ్రీవంగా ఉన్న చోట బి.ఫారం సమర్పించాలని పార్టీ భావిస్తున్నదని రామచంద్రరావు పేర్కొన్నారు. వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తూ అత్యధిక స్థానాలను సాధించేందుకు సన్నద్ధమై ఉందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక ఎన్నికలలో ఓట్లు అడగడానికి అర్హతలేమని కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్, గతంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కేంద్ర నిధులను వ్రుధా చేసి గ్రామాలను దెబ్బతీస్తోందని, అప్పటి సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాజా సర్పంచులు ఎదుర్కొన్న సమస్యలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయని, పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.

రామచంద్రరావు కేంద్రమంత్రి ప్రణాళికలను ఉదహరిస్తూ పీఎం కిసాన్ క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నదన్నారు. ఉచిత బియ్యం సరఫరా జరుగుతోందని చెప్పారు. గ్రామాల్లోని అభివృద్ధి, రోడ్లు, నీటి సరఫరా వంటి పనులు కేంద్ర నిధుల ద్వారా మాత్రమే జరుగుతున్నాయన్నారు. బీజేపీని గెలిపిస్తే మాత్రమే గ్రామాలకు కేంద్ర నిధులు సమర్ధంగా చేరుతాయని, అందువల్ల ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని సూచించారు.

బీసీ రిజర్వేషన్ల, స్థానిక ఎన్నికల ఆలస్యం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వంటి అంశాలపై కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉండగా, బీఎంఆర్‌ఎస్ పార్టీ తప్పు చేస్తోందని విమర్శించారు. అలాగే, ఎన్డీఎస్ఎ ఇచ్చిన నివేదిక ఆధారంగా మేడిగడ్డ, సుందిళ్లకే పరిమితం కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని పరిశీలించి రిపేర్ చేయాలని అన్నారు.

రామచంద్రరావు చివరగా పార్టీ ఫిరాయింపులపై స్పష్టత ఇచ్చారు. బీజేపీని వీడేటప్పుడు మాత్రమే రాజీనామా చేయాలని మరియు పార్టీ సుస్థిరత కోసం అన్ని సభ్యులు కట్టుబడాలని పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, బీజేపీ స్థానిక అభివృద్ధి, గ్రామాల సంక్షేమంపై కేంద్రీకృత దృష్టి పెట్టిన ప్రతిపక్షం అని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img