epaper
Monday, March 16, 2026
epaper

లీగల్ సెల్‌తో బీజేపీకి బలం!

లీగల్ సెల్‌తో బీజేపీకి బలం!
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ స‌ర్కారు ఏర్పాటే ల‌క్ష్యం
రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

కాకతీయ, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్దఎత్తున న్యాయవాదులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చేరికలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమక్షంగా స్వాగతం పలికారు. పార్టీలో చేరిన న్యాయవాదులకు ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. జూనియర్, సీనియర్ న్యాయవాదులతో పాటు వారి బంధుమిత్రులు కూడా పార్టీలో చేరడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. సుపరిపాలన, సంక్షేమ పథకాలు, న్యాయ సంస్కరణల పట్ల ఆకర్షితులై న్యాయవాదులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. బ్రిటిష్ పాలన కాలంలో అమల్లోకి వచ్చిన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ వంటి చట్టాలను స్వతంత్ర భారత అవసరాలకు అనుగుణంగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కాలనీయల్ మైండ్‌సెట్‌ను తొలగించి భారతీయ న్యాయవ్యవస్థకు బలం చేకూర్చినట్లు తెలిపారు. న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసుల తగ్గింపు, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణలోనే దాదాపు 150 మంది యువ న్యాయవాదులకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడమైందని తెలిపారు. న్యాయవ్యవస్థలో వేగం, పారదర్శకత పెరగడం వల్ల సమాజం ఈ మార్పులను స్వాగతిస్తోందన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో సంపూర్ణ పోటీ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ అన్ని సీట్లలో పోటీ చేస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పులు, అవినీతితో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని విమర్శించారు. కమిషన్ వ్యవస్థ 30–40 శాతానికి పెరిగిందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులకు న్యాయం జరగలేదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలకు మోదీ ప్రభుత్వ అభివృద్ధి విధానాలే కారణమని, మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పునాది వేస్తామని చెప్పారు. “సేవ్ తెలంగాణ – ఓట్ ఫర్ బీజేపీ” నినాదంతో ప్రజలను కోరారు. న్యాయవాదులు, మేధావులు ముందుకు వచ్చి రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం దౌత్య విధానం స‌రిగా లేక‌పోవ‌డంతోనే ఇంధన...

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌ వారి హక్కుల సాధ‌న‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది సామాజిక న్యాయం...

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్ గ్యాస్ కొరతతో దోశ, పూరి, వడ తాత్కాలికంగా బంద్ మూతపడుతున్న...

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను...

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు ఏసీబీ వలలో ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసుల...

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత యువత మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్...

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన బంజారాహిల్స్‌,...

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్ రూ.35 వేల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img