epaper
Sunday, March 1, 2026
epaper

కరీంనగర్‌లో బీజేపీకి మెజారిటీ లేదు

కరీంనగర్‌లో బీజేపీకి మెజారిటీ లేదు

ప్రజాస్వామ్య విధానంలోనే మేయ‌ర్ ఎన్నిక

నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం

మంత్రి పొన్నం ప్రభాకర్

కాకతీయ, కరీంనగర్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మెజారిటీ లేనట్టే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే మేయర్ పదవిని ప్రకటించుకోవడం ప్రజాస్వామ్య ఆచారాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొత్తం 60 స్థానాల్లో బీజేపీకి 28 మాత్రమే దక్కాయని గుర్తుచేశారు. అక్కడ మెజారిటీ లేదని చెప్పినవారే, కరీంనగర్‌లో మాత్రం ముందస్తు ప్రకటనలు చేయడం విరుద్ధ ధోరణి అని విమర్శించారు.

69లో 30 సీట్లు మాత్రమే..

కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 69 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి 30 స్థానాలు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. మిగతా స్థానాలు ఇతర పార్టీలకు దక్కాయని చెప్పారు. స్పష్టమైన మెజారిటీ లేకుండానే మేయర్ అవుతామని ప్రకటించడం రాజకీయ ప్రకటన మాత్రమేనని అన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నిక

మేయర్‌ను ప్రజలచే ఎన్నుకోబడిన కార్పొరేటర్లు ప్రజాస్వామ్య విధానంలో ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల జోక్యం ఉండదని, స్థానిక ప్రజాప్రతినిధులే వారి ఆలోచనల మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇండిపెండెంట్లను కలుపుకోవడం అనైతికమా అని ప్రశ్నిస్తూ, రాజకీయాల్లో పొత్తులు సహజమని పేర్కొన్నారు. ప్రతి పార్టీకి తమ వ్యూహాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత చర్చలు జరగడం కొత్త విషయం కాదన్నారు. బీజేపీకి చెందిన 30 మంది కార్పొరేటర్లకూ, ఇతర పార్టీలకు చెందిన సభ్యులకూ శుభాకాంక్షలు తెలిపారు. మూడు లక్షల ఓటర్లున్న కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఉత్తర తెలంగాణలో ప్రముఖ కార్పొరేషన్‌గా ఉన్న కరీంనగర్‌కు మంచి పాలకవర్గం రావాలని ఆకాంక్షించారు.

16న స్పష్టత

మేయర్ ఎన్నికపై 16వ తేదీన స్పష్టత వస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినవారే మేయర్‌ను ఎన్నుకుంటారని, ఎవరినీ అడ్డుకోవాలనే ఉద్దేశం తమకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img