epaper
Thursday, January 15, 2026
epaper

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ కుట్ర‌

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ కుట్ర‌

బీఆర్ఎస్‌, బీజేపీల‌ది ద్వంద నీతి

ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి కొండా సురేఖ‌

కాక‌తీయ‌, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీ మోసం చేస్తే తాము ఊరుకునేది లేద‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక బీసీ మంత్రిగా… బీసీ బిడ్డ‌గా… ఈ విష‌యంలో క‌ప‌ట వైఖ‌రిని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అవ‌లంభిస్తే తాము ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డ‌తామ‌ని మంత్రి సురేఖ హెచ్చ‌రించారు. శుక్ర‌వారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లును తాము అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టి కేంద్రానికి పంపిస్తే బీజేపీ దాన్ని ఆపింద‌న్నారు. ఇది స‌హేతుకం కాద‌న్నారు. ప్రస్తుతం బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉందని చెప్పారు. అయితే, దాన్ని ఒప్పుకుంటారా? లేదో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీజేపీ, కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేయాల‌ని సురేఖ డిమాండ్ చేశారు. బీసీల‌ను మోసం చేసే కార్య‌క్ర‌మాలు చేయోద్ద‌ని బీజేపీని ఉద్దేశించి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్న‌తవ‌ర్గానికి చెందిన నాయ‌కుడైనా ఆయా వ‌ర్గాల‌ను ఒప్పించి బీసీ హ‌క్కులను కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు వివ‌రించారు. ఈ దేశంలో ద‌ళితులు, గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేన‌ని అన్నారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలోని కూడా తాము ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ ఇచ్చామ‌ని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్న‌ది కూడా మేమే అన్నారు. స‌మాజంలో వెన‌క‌బ‌డిన వ‌ర్గాలు, నిమ్న‌వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎప్పుడూ ముందుంటుంద‌ని చెప్పారు. నిన్నఢిల్లీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, బీసీ మంత్రులతో పాటు నిపుణుల కమిటీ కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు ఖర్గే , పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాహుల్ గాంధీలతో భేటీ జ‌రిగింద‌ని గుర్తు చేశారు. ఈ భేటీలో తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌పై కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వం పూర్తి సంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్టు వివ‌రించారు. బీఆర్ఎస్ బీసీ కుల‌గ‌ణ‌న‌లో అస‌లే పాల్గొన‌లేద‌ని, వారికి బీసీల‌పై ప్రేమ ఉండే అవ‌కాశం లేద‌ని మంత్రి విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా బీసీల‌పై బీజేపీ, బీఆర్ఎస్ ద్వంద వైఖ‌రి వీడాల‌న్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img