- ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కేంద్రం
- ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ప్రచారం
కాకతీయ, ఆదిలాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కు అయినటువంటి ఓటు హక్కును దొంగలించి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబట్టారు. ఏఐసీసీ పిలుపుమేరకు బోథ్ మండల కేంద్రంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా వారసంతలో వివిధ వర్గాల వారిని కలిసి ఎన్నికల కమిషన్, బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కును బిజెపి ప్రభుత్వం తన వ్యతిరేక శక్తులను గుర్తించి అక్రమ మార్గాల్లో వారి ఓట్లను తొలగిస్తూ, అధికారంలోకి వస్తుందన్నారు. దానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ తప్పులను సాక్షాలతో ప్రజల ముందు పెట్టాడని గుర్తు చేశారు .
స్వయం ప్రతిపత్తిగా ఉండవలసిన ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా మారి ప్రజాతంత్ర హక్కులకు విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ప్రజాస్వామ్య హక్కుల కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, దొంగ ఓట్లను, ఓట్ చోరీని అడ్డుకొని తీరుతామని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తామనికాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోడ్డు గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ ఎంపిటిసి చట్ల ఉమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్, దళిత కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్యాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


