epaper
Monday, March 2, 2026
epaper

కామారెడ్డి ఘటనపై బీజేపీ ఆగ్రహం

కామారెడ్డి ఘటనపై బీజేపీ ఆగ్రహం
ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌పై దాడి కాంగ్రెస్ అరాచకానికి నిదర్శనం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం
రామచందర్ రావు అరెస్టు పై ఖండన
కరీంనగర్‌లో బీజేపీ ఆందోళన, దిష్టిబొమ్మ దహనం

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్‌ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం వారి అరాచక రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పి శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కామారెడ్డి ఘటనను నిరసిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఆదివారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సంద‌ర్బంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ ప్రజల భద్రతను పరిరక్షించలేని పరిస్థితి నెలకొన్నదని, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల రౌడీయిజం పెరిగిపోయి దాడులు, దౌర్జన్యాలు సాధారణమైపోయాయని ఆరోపించారు. శాంతిభద్రతలను పరిరక్షించలేని ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై చర్యలు తీసుకోవడం దారుణమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకట్ రెడ్డి, నరసింహ రాజు, కార్పొరేటర్లు బోయిన్పల్లి ప్రవీణ్ రావు, బండ రమణ రెడ్డి, సోమిడి వేణు ప్రసాద్, బండారి వేణు, సౌగాల కొమురయ్య, నాంపల్లి శ్రీనివాస్, తాటి ప్రభావతి, ఎన్నం ప్రకాష్, కోడూరి చంద్ర, బీజేపీ మీడియా కన్వీనర్ కటకం లోకేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img