ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు
కాకతీయ, జూలూరుపాడు: భారతీయ ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుడు, జానపద నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు మండలంలో పడమట నర్సాపురం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యాలయంలో భాగంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుభద్ర ముందుగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులకు బిర్స ముండా భారతదేశం కోసం,ఆదివాసీల కోసం,చేసిన సేవలు గురించి విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు ఆదివాసీ వేష ధారణ ధరించి ముండా జయంతి వేడుకలు జరుపుకొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వి.సరిత,సుజాత,శ్రీను,సునీత,మంగీలాల్,భాస్కర్,నవీన్,రాంబాయ్,భారతీ,శ్రావ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.


