కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో అత్యవసర పరిస్థితుల్లో కీలకంగా పనిచేసే హైడ్రా సేవలు నిలిచిపోయాయి. ఇటీవల ప్రభుత్వం హైడ్రా ఉద్యోగుల జీతాలను రూ.7,000 తగ్గిస్తూ జీవో జారీ చేయడంతో, హైడ్రా మార్షల్స్ ఆందోళనకు దిగారు.
విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన మార్షల్స్ కారణంగా, హైడ్రా కంట్రోల్ వద్ద 51 అత్యవసర వాహనాలు కదలికలు ఆపేశాయి. దీంతో నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చాక చర్చిస్తామని, అప్పటివరకు ఆగకపోతే రాజీనామా పత్రాలపై సంతకం చేయాలని హైడ్రా అధికారులు మార్షల్స్‌కు సూచించినట్టు సమాచారం. ఈ పరిణామాలతో అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


