ముద్దునూరు జీపీ సర్పంచ్‌గా భూక్య వనీత
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం పరిధిలోని ముద్దునూరు తండా గ్రామపంచాయతీ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది. గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకొచ్చి భూక్య వనీత–రాజేందర్‌కు అఖిల పక్ష మద్దతు ప్రకటించడంతో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. అటు గ్రామంలో మొత్తం 8 వార్డ్ సభ్యుల పదవులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అనంతరం ఆదివారం గ్రామంలో పూర్తిస్థాయి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గంలో సర్పంచ్ గా భూక్య వనీత–రాజేందర్, ఉపసర్పంచ్ గా వాగి, వార్డు సభ్యులు గా గూగులోతు లలిత, మాలోతు దేవోజీ, బానోతు సునీత, ధరావత్ సునీత, జాలియా బుక్ చేసి, సునీత గూగుల్, వద్దు సంధ్య, గూగుల్ శారద ఉన్నారు. గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవ ఎన్నికలు ఒక మంచి అవకాశం అవుతాయని, సమగ్ర అభివృద్ధి కార్యాచరణలను చేపడతామని కొత్త పాలకవర్గం స్పందించింది.


