భవిత సెంటర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నూతన భవితా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
కాకతీయ, పెద్దపల్లి : జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవిత సెంటర్ పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.గురువారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి పట్టణంలో భవిత సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్రం నిర్మాణం నాణ్యతతోపాటు మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.భవిత సెంటర్‌కు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న రేకుల షెడ్డు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పర్యటనలో మండల విద్యాధికారి సురేందర్ కుమార్, ఐ.ఈ.ఆర్.పీ సంధ్యా రాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


