భక్తుల ఇంటికే భద్రాద్రి రాముడి కళ్యాణ తలంబ్రాలు
టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ప్రత్యేక సేవలు
కాకతీయ, కరీంనగర్ : భక్తుల సౌకర్యార్థం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ తలంబ్రాలను టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే చేరవేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సేవలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను శుక్రవారం కరీంనగర్ ప్రాంతీయ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సేవల ద్వారా భక్తులు రూ.151 చెల్లించి మార్చి 31, 2026 వరకు కళ్యాణ తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా తలంబ్రాలను నేరుగా భక్తుల నివాసాలకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం కరీంనగర్ 9154298561, 9154298581; హుజురాబాద్, హుస్నాబాద్ 9154298559; సిరిసిల్ల, వేములవాడ 9154298576; జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి 7780250439; గోదావరిఖని, పెద్దపల్లి, మంథని 9949407275 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ మేనేజర్ బి. రాజు, ఏవో రవికుమార్, పిఓ సంపత్, టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ సిబ్బంది పాల్గొన్నారు.


