కాకతీయ, ఇనుగుర్తి: మండలం లోని అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పోలీస్ ఉద్యోగులకు ఉత్తమ సేవా పథకాలు లభించాయి. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రం ఎస్పీ ఆఫీసులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నర్సింహుల పేటలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న పెండెం వెంకన్న,ఏఆర్ కానిస్టేబుల్ గా జిల్లా హెడ్ క్వార్టర్ లో పనిచేస్తున్న కోరుకొండ వెంకన్న గౌడ్ ల ఉత్తమ సేవలను గుర్తించిన పోలీస్ శాఖ,ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ చేతుల మీదుగా సేవా పథకాలను అందజేశారు.రూ.20 వేల చొప్పున రివార్డులు పొందారు.
దీంతో అయ్యగారిపల్లితో పాటు మండల వ్యాప్తంగా పలువురు వీరిని అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ.. ఇద్దరం బాల్యంలో కలిసిమెలిసి ఉండడం,ఉద్యోగంలో ఉత్తమ సేవలు అందించడం,పురస్కారాలు పొందడం సంతోషంతో పాటు సంతృప్తినిస్తోందన్నారు.


