మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కాకతీయ, రామకృష్ణాపూర్ : సైబర్ క్రైమ్ మోసాలపైప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఏఎస్సై వెంకయ్య తెలిపారు. సైబర్ క్రైమ్ మోసానికి గురైన ఓ బాధితుడు నగదును కోల్పోయినట్లు శనివారం ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గుర్తు తెలియని లింక్ లను నొక్కి మోసాలకు గురి కావద్దని ఏఎస్సై సూచించారు


