- రామకృష్ణాపూర్ టౌన్ ఎస్సై జీ.రాజశేఖర్
కాకతీయ, రామకృష్ణాపూర్ : సైబర్ క్రైమ్ మోసాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ టౌన్ ఎస్సై జీ.రాజశేఖర్ సూచించారు. సైబర్ జాగరూకత దివాస్ కార్యక్రమంలో భాగంగా గద్దె రాగడి లోని క్రైస్ట్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన కల్పించారు. అలాగే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫిర్యాదు ఇవ్వాలని తెలిపారు. ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


