epaper
Tuesday, January 20, 2026
epaper

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి!

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి!
డావోస్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు శ్రీధర్ బాబు పిలుపు
2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% లక్ష్యం
పరిశ్రమలకు అనుకూల పాలసీలు… అపార అవకాశాలు
పెట్టుబడులు–ఉపాధే లక్ష్యం
‘ఇండియా పెవిలియన్’ ప్రారంభంలో ఆహ్వానం

దావోస్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గ్లోబల్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సులో భాగంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన్’ ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్న ఆయన, రాష్ట్ర పారిశ్రామిక దృక్పథాన్ని ప్రపంచానికి చాటారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంతో దార్శనికతతో కూడిన, ప్రణాళికాబద్ధమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు. అదే కాలానికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు.

కీలక రంగాలపై ఫోకస్

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని శ్రీధర్ బాబు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, హెల్త్‌కేర్ ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, హార్డ్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీఈఎస్, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్, అప్పారెల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌, వేగవంతమైన అనుమతులు, స్థిరమైన పాలసీలే రాష్ట్ర బలమన్నారు.

పెట్టుబడులే ఉపాధి

కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. దావోస్ వేదికగా గత రెండేళ్లలోనే సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించామని వెల్లడించారు. ఈ ఏడాదీ అదే స్ఫూర్తితో పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడే నవీన పాలసీలను ప్రపంచానికి వివరించి, దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తామన్నారు. ‘తెలంగాణ బ్రాండ్’ను మరింత విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0తో పాటు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH)ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరించనున్నట్లు శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రపంచ పెట్టుబడుల పటంలో తెలంగాణను కీలక గమ్యంగా నిలపాలన్నదే తమ దృఢ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img