epaper
Monday, March 2, 2026
epaper

పోరుకు జై కొట్టిన బీసీలు..

  • 42% రిజర్వేషన్ కోసం కదం తొక్కిన ఓరుగల్లు

కాకతీయ, వరంగల్ బ్యూరో : మేమెంతో… మాకంత! అనే నినాదంతో హనుమకొండ వీధులు మారమోగాయి. ఓబీసీ చైర్మన్, మాజీ కుడా చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో సబ్బండ కులాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, కార్మికులు, దళిత, మైనారిటీ సంస్థలు కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఏకమయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అదాలత్ సెంటర్‌ వరకు భారీ ర్యాలీగా కదిలిన బీసీ ఉద్యమ కవాతు ఊరంతా హోరెత్తించింది. సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు, మేధావులు, బీసీలు కలిసి పోరాడి రాష్ట్రాన్ని సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే 42 శాతం రిజర్వేషన్ తప్పనిసరి అని అన్నారు.

విద్యార్థుల కదలికతో ఊగిపోయిన ఓరుగల్లు..

అంబేద్కర్‌ సెంటరు నుంచి అమరవీరుల స్మారక స్థూపం వరకు సాగిన కవాతులో విద్యార్థులు చీమల దండులా కదిలారు. రెండు గంటల పాటు కాళోజీ సెంటర్, ఎన్పీడీసీ ఎల్ ఆఫీస్ మీదుగా సాగిన ర్యాలీ నగరాన్ని స్తంభింపజేసింది. ర్యాలీకి ముందే పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏసీపీ, ముగ్గురు సీఐలు, పలువురు ఎస్సైలు పర్యవేక్షణలో ట్రాఫిక్ నియంత్రణ సజావుగా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి.

డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..

హనుమకొండ బస్ డిపో ఎదుట ఉదయం నుంచే బీసీ ఉద్యమకారులు ధర్నా నిర్వహించారు. సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులు, మహిళా సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు బస్సులను బయటకు వెళ్లనీయకుండా నిరసన చేపట్టారు. బీసీ ఉద్యమం ఇక బహుజన సమరంగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఉద్యమ పట్టుగొమ్మ ఓరుగల్లు..

విద్యార్థులు, మేధావులు, సామాజిక సంస్థలు, కార్మికులు కలిసి శనివారం బీసీ బంద్‌ ను ప్రజా సమరంగా మార్చారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ర్యాలీ, రాష్ట్రవ్యాప్తంగా బీసీల హక్కుల పోరాటానికి నాంది పలికింది. కార్యక్రమంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, వేణుమాధవ్, మౌనిక గౌడ్, తీగల భరత్ గౌడ్, రాజేష్ కుమార్, బోనగాని యాదగిరి గౌడ్, రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img