మహబూబాబాద్ జిల్లాలో బీసీ బంద్
స్తంభించిన రవాణా వ్యవస్థ
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
కాకతీయ మహబూబాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అన్ని రాజకీయ పక్ష పార్టీలు శనివారం బందుకు పిలుపు ఇవ్వడంతో జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడినారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుండి బస్సుల కొన్ని బయటికి రావడంతో అక్కడక్కడ ఆర్టీసీ బస్సులను నిరసనకారులు అడ్డుకున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో అన్ని అఖిలపక్ష పార్టీల నాయకులు అన్ని మండల కేంద్రాలలో బైక్ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు నిర్వహించారు. దీంతో రవాణా వ్యవస్థ స్తభించింది. బయ్యారం నుండి ఇల్లెందుకు వెళ్లే ప్రధాన రహదారిపై నాయకులు బీసీ రిజర్వేషన్ పై ఆందోళన నిర్వహించారు.జిల్లాలోని కొన్ని మండల కేంద్రాలలో బంధు ప్రభావం అంతంతమాత్రంగానే కనిపించింది. అక్కడక్కడ పెట్రోల్ బంకులు ఓపెన్ గా ఉన్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ లు మూసి వేశారు.ఇతర అత్యవసర సేవలకు కూడా బందు తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
దూరప్రాంతాల నుంచి వచ్చి, వెళ్లేవారు తమ సొంత వాహనాల్లోనే ప్రయాణం చేయవలసి వచ్చిందని సమాచారం. బీసీ రిజర్వేషన్ పై అన్ని పార్టీలు అనుకూలమన్నా, ఎవరు దీనికి వ్యతిరేకం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బిసి రిజర్వేషన్ అమలు పరుస్తామని బహిరంగంగా తెలిపినది వారే కదా.. రిజర్వేషన్ ఎందుకు అమలుపరచలేదని , కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం విడ్డూరంగా ఉందని, పలువురు చర్చించుకుంటున్నారు. బీసీ బందు పై పలువురు పలు రకాలుగా చర్చించుకోవడం విశేషం.


