కాకతీయ, బయ్యారం: బయ్యారం రైతు సహకార సంఘంలో లోపా భూయిష్టమైన అనేక అక్రమాలు జరిగినట్లు అధికారుల పర్యవేక్షణలో వెల్లడైనట్లు.. జిల్లా అధికారులు సొసైటీ పాలక వర్గంను ఈనెల 15న రద్దు చేసినట్లు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కథనాలు, సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత కమిటీలో అధికారిక వ్యక్తిని నియమిస్తున్న అంశంపై, బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఏసిఎస్) వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యక్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. సొసైటీ రద్దు కావడానికి ప్రస్తుత పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీ పనిచేయడంలో కొన్ని లొసుగులు, చట్టపరమైన విఘాతం, నిర్లక్ష్యం పలు అంశాల్లో తలెత్తాయని సమాచారం. పాత రుణాలలో మొత్తం 1440 సభ్యుల రైతులకు, రూపాయలు 3,89,30,246.64 బాకీగా ఉన్నాయి. ఇందులో రూ,,3,23,24,484.64 పై లీగల్ యాక్షన్ సొసైటీ తీసుకోలేదు. లాంగ్ టెర్మ్ రికవరీ శాతం (గిల్టీ) 0%. శాతం ఉన్నట్లు సమాచారం.
ఫైనాన్సింగ్ బ్యాంకుతో డబ్బు అప్పులు, అడ్వాన్స్‌లు తప్పుగా ఉన్నట్లు సమాచారం . 2019-20, 2024-25 సంవత్సరాల్లో రూ. 28,30,617.26 తేడా ఉన్నట్లు సమాచారం. రైతుల అప్పుల ఇతర డిఫాల్టర్ల జాబితా తయారు చేయలేదు, పబ్లిష్ చేయలేదని. ఈ వివరాలు ఆడిట్ లో చూపించిన లోపాలను చూపలేదని సమాచారం. కమిటీ మెంబర్స్‌లో వారికి సొసైటీకి డబ్బు బాకీ ఉన్న సభ్యులు ఉన్నారు. సండ్రీ డిబిటర్లు (స్టండరీ డిప్టర్సు ) ద్వారా మొత్తము రూపాయలు 9,24,794.36 రాబడి డబ్బులు జమ చేయలేదు. సొసైటీకి 2024-25లో రూపాయలు 33,06,563.62 నష్టాలు వచ్చాయి, ఘన నష్టాలకు కారణం అ భద్రంగా ఉంది.
ప్రెసిడెంట్, సెక్రటరీ పై ఆరోపణలు వచ్చాయి. సిఇఓ రూపాయలు 1,51,100 సొసైటీ ఫండ్ ఫ్రాడ్ జరిగినట్లు సమాచారం. స్టాక్ వెరిఫికేషన్ లో రూపాయలు 54,37,327.02 డిటెక్టివ్ స్టాక్ కనుగొనబడినట్లు సమాచారం. దీనిపై పాలక మండలి చైర్మన్, డైరెక్టర్ లు తమ రాజకీయ పలుకుబడితో ఎమ్మేల్యే,మంత్రులతో అధికారులకు ఫోన్ లో రాజకీయ పైరవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
దీనిపై మహబూబాబాద్ జిల్లా డిసిఓ వెంకటేశ్వర్లను కాకతీయ ప్రతినిధి ఫోన్ లో వివరణ కోరగా ,బయ్యారం సొసైటీలో అక్రమాలు జరిగినట్లు విచారణ చేసి నిర్ధారణ జరిగిందని, ఈనెల 15 పాలక మండలిని రద్దు చేసి, ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. పాలక మండలి, సొసైటీ చైర్మన్ మూల మధుకరెడ్డిని, తొలగించినట్లు తెలిపారు. వీరి స్థానంలో ప్రత్యేక అధికారిని కోడేటి ఆదినారాయణను నియమించినట్లు తెలిపారు. ఇంకా విచారణ జరగవలసి ఉన్నదని తెలిపారు.


