కాకతీయ, బయ్యారం: మండల స్వాతంత్ర్య సమరయోధుడు చెన్న బోయిన అచ్చయ్య ( 99) ఆదివారం ఆనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. మండలంలో 1956 సం.నకు పూర్వం బయ్యారం, గార్ల మండలంలో ,రజాకార్ల పై పోరాటం సాగించి, రజాకారుల గుండెల్లో గుబులు పుట్టించిన, మహయోధుడిగా పేరు పొందారు. బయ్యారం మండలంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడి రజాకార్ల పై గుర్రపు స్వారీ చేస్తూ, వారికి కంటి మీద కునుకు లేకుండా చేసిన, గొప్ప పేరున్న నాయకుడిగా చెన్నబోయిన అచ్చయ్య ఒకరు.
గుర్రపు స్వారి చేయడంలో గొప్ప నేర్పరి గా పేరు పొందారు. వీరి మరణం రెండు మండలాల వారికి స్తూర్తి దాయకంగా నిలిచి, వారి సేవలను కొనియాడుతూ గుర్తు చేసుకున్నారు. మండలంలో మృతుని భౌతిక దేహాన్ని సందర్శించి, పలువురు నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తుమ్మల శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.


