ఇనుగుర్తిలో బతుకమ్మ విగ్రహవిష్కరణ
విగ్రహ దాత హరిచంద్ నాయక్ ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
కాకతీయ, ఇనుగుర్తి:
మండలంలోని స్థానిక ఇనుగుర్తి గ్రామంలోని కత్తువ కట్ట గుంట దగ్గర చీన్య తండా మాజీ సర్పంచ్ జాటోత్ అరుణ హరిచంద్ర నాయక్ హార్దిక సహకారంతో ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బతుకమ్మ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మాల కులస్తుల కోరిక మేరకు హరిచంద్ర నాయక్ రూ ఒక లక్ష 50 వేలు సొంత ఖర్చులతో బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం విగ్రహ దాత జాటోత్ హరిచంద్ర నాయక్ ను మాజీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భిఆర్ఎస్ నాయకులు మాల కులస్తులు తదితరులు పాల్గొన్నారు.


