ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర సెక్రటరీగా బానోత్ చంద్రశేఖర్
కాకతీయ, పెద్దవంగర : తెరాష్ట్ర ఉపసర్పంచ్ సంఘం రాష్ట్ర సెక్రటరీగా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామ ఉపసర్పంచ్ *బానోత్ చంద్రశేఖర్*ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఉపసర్పంచులతో కూడిన కార్యవర్గాన్ని సమిష్టి ఆమోదంతో ఎంపిక చేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లావుడ్యా రాము నాయక్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణబోయిన రాజు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం సంఘం బలంగా పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉపేందర్, ఎల్లయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


