కాకతీయ, నేషనల్ డెస్క్: సెప్టెంబర్ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉన్నట్లయితే ఈ సెలవుల గురించి ముందే తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెలలో దాదాపు 15రోజులు బ్యాంక్ లు బంద్ ఉండనునున్నాయి. ఎందుకంటే ఈ నెలల్లో కొన్ని ముఖ్యమైన తేదీల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. అందులో దేశవ్యాప్తంగా జరుపుకునే ఈద్ మిలాద్ సెప్టెంబర్ 5, ప్రతినెలా వచ్చే రెండు శనివారం సెప్టెంబర్ 13, నాలుగో శనివారం సెప్టెంబర్ 27 కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో పాటు కొన్ని పండగ రోజుల్లో బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి.
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్
సెప్టెంబర్ 3 (బుధవారం): కర్మ పూజ సందర్భంగా రాంచీలో బ్యాంకులు బంద్
సెప్టెంబర్ 4 (గురువారం): ఓనం పండుగ నేపథ్యంలో కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు హాలిడే
సెప్టెంబర్ 5 (శుక్రవారం): ఈద్ మిలాద్ (మిలాద్-ఉన్-నబీ) సందర్బంగా అగర్తలా, భువనేశ్వర్, చంఢీగఢ్, గ్యాంగ్ టక్, గౌహతి, జైపూర్, కోల్కత్తా, పనాజీ, పాట్నా, సిమ్లా, షిల్లాంగ్ ప్రాంతాలు కాకుండా, ఇతర ప్రాంతాల్లో హాలిడే
సెప్టెంబర్ 6 (శనివారం): ఈద్ మిలాద్ (మిలాద్-ఉన్-నబీ) నేపథ్యంలో గ్యాంగ్ టక్, రాయ్ పూర్ ప్రాంతాల్లో సెలవు
సెప్టెంబర్ 7 (ఆదివారం): వారాంతపు సెలవు
సెప్టెంబర్ 12 (శుక్రవారం): ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తర్వాత శుక్రవారం జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో సెలవు
సెప్టెంబర్ 13 (శనివారం): రెండో శనివారం దేశవ్యాప్తంగా సాధారణ బ్యాంక్ సెలవు
సెప్టెంబర్ 14 (ఆదివారం): వారాంతపు సెలవు
సెప్టెంబర్ 21 (ఆదివారం): వారాంతపు సెలవు
సెప్టెంబర్ 22 (సోమవారం): నవరాత్రి నేపథ్యంలో జైపూర్లో సెలవు
సెప్టెంబర్ 23 (మంగళ వారం): మహారాజా హరి సింగ్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో హాలిడే
సెప్టెంబర్ 27 (శనివారం): నాలుగో శనివారం – సాధారణ బ్యాంక్ సెలవు.
సెప్టెంబర్ 28 (ఆదివారం): వారాంతపు సెలవు
సెప్టెంబర్ 29 (సోమవారం): మహా సప్తమి/దుర్గా పూజ సందర్భంగా అగర్తలా, గౌహతి, కోల్కత్తా ప్రాంతాల్లో సెలవు
సెప్టెంబర్ 30 (మంగళ వారం): మహా అష్టమి/దుర్గా అష్టమి నేపథ్యంలో అగర్తలా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్కత్తా, పాట్నా, రాంచీ ప్రాంతాల్లో హాలిడే


