కాకతీయ, హనుమకొండ : హనుమకొండ వికాస్‌నగర్‌లో ఆరు రోజులుగా జరుగుతున్న బంజారా తీజ్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం దద్దరిల్లి పోతుండగా, బంజారా బాలికలు, ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
200 బుట్టలలో వేసిన గోధుమ మొలకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, ప్రజల ఆధరణ పెరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 20న డమోలి, 21న నిమజ్జనంతో ఉత్సవాలు ముగియనున్నాయి. వేలాది మందితో మహా ర్యాలీగా నిమజ్జనాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తీజ్ ఉత్సవ కమిటీ నాయకులు వెల్లడించారు.


