బండి సంజయ్ హామీని నిలుపుకోవాలి
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిరిసిల్ల పట్టణ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. ఎంపీ ఎన్నికల సమయంలో తమ వార్డు చిన్న బోనాలకు వచ్చిన సంజయ్ గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ మాటను నమ్మి ప్రజలు ఆయనకు అఖండ మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలు గడిచినా హామీ అమలు కాలేదని నాగరాజు గౌడ్ ఆరోపించారు. గత మున్సిపల్ కౌన్సిల్ లో నాగరాజు గౌడ్ బీజేపీ కౌన్సిలర్ గా కొనసాగారు. తాజా ఎలక్షన్‌లో బీజేపీ నుండి టికెట్ రాకపోవడంతో తన భార్య వైష్ణవిని 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి విజయం సాధించారు.


